తాళ్లూరు: దర్శి నియోజక వర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా కాంగ్రెస్, వైసీపీ ప్రత్యేకించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమానులుగా ఉన్న 30 కుటుంబాలు ఆ అనుబంధాన్ని తెంచుకుని టిడిపి పంచకు చేరాయి. వైసీపీ తాళ్లూరు మండల ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి ఆ గ్రామం కావటం గమనార్హం. అదే గ్రామానికి చెందిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఆధ్వర్యంలో సోమవారం టిడిపి పార్టీ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కష్టించి పనిచేసే వారికి టిడిపి లో గుర్తింపు ఉంటుందని చెప్పారు. వైసీపిని వీడి టీడీపిలో చేరిన వారిలో తూము కామి రెడ్డి, పేరి రెడ్డి, లోకిరెడ్డి నరసింహా రెడ్డి, పాపి రెడ్డి, శ్రీను పంతులు, బిజ్జం నాగి రెడ్డి, రామ కృష్ణ , బల్లికురువ రమణయ్య, కొండ్రు ఆదిశేషు, విప్పేర్ల రామారావు, దివన బాబు, ఎలియా, పరిశుద్ధంతో కుటుంబసభ్యులతో పాటు 30 మంది ఉన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు బొడ్డు హనుమా రెడ్డి, ఆవుల ఆదినారాయణ, తూము లక్ష్మి రెడ్డి, మాజీ ఎంపీటీసీ తూము వెంకట సుబ్బా రెడ్డి, సంపతి శ్రీను, కొత్త మారం పేరి రెడ్డి తదితరులు ఉన్నారు.


