తాళ్లూరు: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకుఅటవీశాఖ అధికారుల చర్యలు చేపట్టారు. గత రెండు రోజుల క్రితం వర్షం కురవటంతో ఫారెస్ట్ భూములలో సీడ్స్ బాల్స్ను వేద జల్లారు. ఒంగోలు ఫారెస్ట్ డివిజన్ పరిధిలో శివరామపురం, చప్పిడి తిప్ప, దేవర పాలెం, అటవీ భూములో డ్రోన్స్ సహాయంతో పాటు గిరిజన కూలీల సహాకారంతో 60వేల సీడ్ బాల్స్ చల్లారు. ఈ సీడ్ బాల్స్లో నీడను పండ్లను ఇచ్చే వేప, మర్రి, రాగి, మద్ది, నేరుడు విత్తనాలు ఉన్నట్లు చెప్పారు. ఒంగోలు ఫారెస్ట్ రేండ్ ఆఫీసర్ ఇట్టా తులసీ రావు, ఫారెస్ట్ రైట్స్ కమిటీ చైర్మన్ ఇట్టా బాబు రావు, సెక్షన్ అధికారి కరిముల్లా బీట్ అధికారులు శబిభూషణ్ యాదవ్, అమర తదితరులు పాల్గొన్నారు.

