ఈవీఎం గోడౌన్ ల సాధారణ తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు భాగ్యనగర్ నాలుగో లైన్ లో గల ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను సాధారణ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ నిర్వహిస్తున్న బందోబస్తును పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. గోడౌన్ చుట్టూ ప్రతిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆయన ఇతరులకు సూచించారు. భద్రత ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: