స్థానిక సంస్థలు (కందుకూరు మున్సిపాలిటీ) మరియ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు మరియు ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు , ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు. జిల్లాలో మూడు విడతలుగా చేపట్టనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒంగోలు మరియు కొండపి నియోజకవర్గాలలోని 8 మండలాలలో నిర్వహించనున్నారు. కందుకూరు మున్సిపాలిటీలు నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ ఎన్నికలలో సుమారుగా 10 లక్షల 70902 మంది ఓటర్లు పాల్గొననున్నారు. జిల్లాలో పంచాయతీలు ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేసినట్టు జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ స్టేషన్ల వద్ద వద్ద పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. తొలి విడత లో నిర్వహించనున్న 139 గ్రామపంచాయతీ గాను 62 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా 77 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ సంబంధిత పంచాయతీ అధికారి మరియు కందుకూరు మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే పై అధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ కందుకూరు మున్సిపల్ కమిషనర్ అనూష డిపిఓ అనుపమ తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: