తాళ్లూరు: కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో ఆలయాలు కిట కిట లాడాయి. తాళ్లూరు, శివరామపురం, గుంటి గంగ, మాధవరం, బొద్దికూర పాడు, లక్కవరం గ్రామాలలో భక్తులు స్వామి వారిని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపోత్సవం నిర్వహించారు. బికే పాడు గంగా పార్వతి వర్థిని ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మాకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం దర్శి వారిచే కార్తీక పౌర్ణమి ప్రాధాన్యత గురించి వివరించారు. ఓంశాంతి ఉష దైవ సంబంధమైన అధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: