సనత్ నగర్ నవంబర్ 24,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
కార్తీక పౌర్ణమి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని, సనత్ నగర్ నియోజకవర్గం, అమీర్‌పేట్‌లోని హనుమాన్ దేవాలయంలో మాజీ మంత్రివర్యులు, NDMA మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో దీపాలను వెలిగించారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు నక్క శ్రీనివాస్ గౌడ్, దశరథ్, అనిల్ కుమార్, పి. నరేందర్, వి. సత్యనారాయణ, శివప్రసాద్, దయానంద్ రావు తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: