బేగంపేట ,జులై 21,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రకాశం నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన దర్గా కరుణాకర్‌ను బేగంపేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నసీరుద్దీన్ (అడ్డు) ఘనంగా సన్మానించారు. ఓల్డ్ కస్టమ్స్ బస్తీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరుణాకర్‌ను నసీరుద్దీన్ పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు.
దట్టి కట్టి అభినందించారు.
ఈ సందర్భంగా నసీరుద్దీన్ మాట్లాడుతూ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రకాశం నగర్, బేగంపేట డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి శ్రేణులంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ రాజేందర్ ముదిరాజ్, సిద్ధిక్, మునీర్, జమీర్, సురేష్ బాబు, నవీన్, మహిళా నాయకులు రాధ, చంద్రకళ, ధనలక్ష్మి, సలీం, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.

