బేగంపేట జులై 21,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఘటం మంగళవారం కళాసిగూడకు వెళ్ళింది.ఉదయం ఆలయం నుంచి బయలు దేరిన ఘటం పుర వీధులలో భక్తులకు దర్శనం ఇచ్చింది.ఈ సందర్భంగా పుర వీధులలో భక్తులు అమ్మవారి ఘటానికి పూజలు నిర్వహించారు. రోజంతా కళాసిగూడ ప్రాంతంలోని వివిధ కాలనీల్లో తిరిగింది. డప్పు చప్పుళ్లు బ్యాండు మేళాలతో అమ్మవారి ఘటం బయలుదేరింది.

