ప్రకాశం జిల్లా కనిగిరి నుండి హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ వరకు నడవనున్న కనిగిరి డిపో ఆర్టీసీ బస్సు ఆన్లైన్లో రిజర్వేషన్ల (సర్వీస్ నెంబర్ 5807) సమయంలో కొత్త బస్సులు చూపించి పాతకాలం డబ్బా బస్సును సర్వీసులో ఉంచారని, డిపో అధికారులపై రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు మండిపడ్డారు . ముక్కు పిండి జీఎస్టీ తో పాటు టికెట్ ధరను వసూలు చేసే డిపో అధికారులు ఆన్లైన్లో కొత్త బస్సును చూపించారని, తీరా ప్రయాణం సమయంలో సీట్లు సక్రమంగా లేని, సైడ్ మిర్రర్లు స్ట్రక్ అయిపోయిన, బస్సు పెట్టారని, డిపో అధికారుల తీరుపై ప్రయాణికులు కసుబుసు అన్నారు, గురువారం రాత్రి 10: 50 గంటలకు కనిగిరి నుండి మార్కాపురం వచ్చిన ఆ బస్సు రూపురేఖలు చూస్తే గమ్యస్థానానికి చేరుకోగలమా అనే అనుమానం ప్రయాణికులలో నెలకొంది ? ఇలా ఎలా చేస్తారనీ మిర్రర్ లు ముందుకు కదలక, సీట్లు సక్రమంగా లేక ఉన్న ఈ బస్సులో ఎలా ప్రయాణిస్తామని ప్రయాణికులు ఆర్టీసీ డ్రైవర్ పై నిప్పులు జరగడంతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే డిపో అధికారులతో మాట్లాడుకోండి నేనేమి చేయలేను అంటూ ప్రశ్నించే ప్రయాణికులపై డ్రైవర్ తెలిపారు. కనీసం దూర ప్రయాణానికి కూడా మంచి బస్సులు వేయలేరా…. టికెట్ ధర చెల్లిస్తున్నాము కదా !ఇంత నిర్లక్ష్యం ఎలా అని ఆర్టీసీ అధికారుల తీరును తీవ్రంగా విమర్శించారు.
ఏది ఏమైనా ఆర్టీసీ కంటే ప్రైవేట్ బస్సులు నాణ్యతతో వాహనాలు నడుపుతూ ప్రయాణికుల పట్ల గౌరవంగా మెదులుతుంటే ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ప్రయాణించే ప్రయాణికులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు చర్చించుకున్నారు.
