ప్రతి ఒక్క మహిళ తమ ఆరోగ్యంపై అవగాహన కలిగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తాళ్లూరు పీహెచ్సీ వైద్యులు డాక్టర్ రాజేష్ యాదవ్ అన్నారు. మల్కాపురం పంచాయతీలో సోమవారం స్వర్త్ నారీ సస్తపరివార్ లో బాగంగా ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యశిబిరాన్ని సర్పంచి వలి, బి ఎం సి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సైదావలి లు ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించారు. వైధ్యాధికారి రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో 105 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. హెచ్ ఓ రమణ, హెల్త్ సూపర్ వైజర్ రవి కుమార్, పీహచ్ఎన్ విజయమ్మ, 104 సిబ్బంది, ఎం ఎల్ హెచ్ పి , ఆరోగ్య, ఆశ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీలు పౌష్టికాహా ప్రదర్శన నిర్వహించి పౌష్టికాహార ప్రాధాన్యత వివరించారు.

