బేగంపేట సెప్టెంబర్ 30 (జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 148 దరఖాస్తులు అందాయి. వీటిలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి 45 దరఖాస్తులు ,రెవెన్యూ శాఖకు సంబంధించి 21 దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం 39 దరఖాస్తులు ప్రవాసి ప్రజావాణి కి రెండు దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 41 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు సీఎం ప్రజావాణి ఇన్చార్జి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తుల స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.
