బేగంపేట నవంబర్ 3, (జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరం లో ఆహ్లాదం కరువవుతోంది.ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు అలంకారంగా మారాయి.పార్కుల్లో చెత్తా,చెదారం పేరుకు పోవడం తో పాటు పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి.ఆహ్లాదాన్ని పెంచాల్సిన పార్కులు అనారోగ్యాన్ని పంచే కేంద్రాలుగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.బేగంపేట ఓల్డ్ పాటిగడ్డ లో ఉన్న పార్కు చాలా కాలంగా నిరుపయోగంగా మారడంతో అందులో పిచ్చి మొక్కలు మొలిచాయి. ఇదే అదునుగా భావించిన కొందరు చెత్తను కవర్లలో చుట్టి పార్కులో పడవేస్తుండటంతో ఆహ్లాదాన్ని పంచల్సిన పార్కు అనారోగ్యాన్ని పంచుతుందని స్థానికులు ఆపోతున్నారు ఓల్డ్ పార్టీ గడ్డలో ఉన్న ఈ పార్కును గతంలో ఎంతో సుందరంగా తయారు చేశారు ఆ తర్వాత నిర్వహణ పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలతో పార్కు నిండిపోయింది దీంతో యువకులు సీనియర్ సిటిజెన్సు మహిళలు ఉదయం సాయంత్రం వాకింగ్ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది ఇదే సమయంలో సాయంత్రం చిన్నారులు ఆడుకునే వీలు లేకుండా పోయిందని చిన్నారులు తల్లిదండ్రులు వాపోతున్నారు రైల్వే స్టేషన్ ముందు తాము వాకింగ్ చేసుకోవాల్సి వస్తుందన్నారు పార్కులో మొక్కలు పెరిగిపోయి చెత్త నిండిపోయి కంప కొడుతుండడంతో కాలనీ రోడ్లపైనే ఆడుకుంటూ చిన్నారులు వాహనాలకు తగిలి ప్రమాదాలకు గురవుతున్నారని వారు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఓల్డ్ పాటిగడ్డలో నిరుపయోగంగా మారి అనారోగ్యాన్ని పంచుతున్న ఈ పార్కులను శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
