హైదరాబాద్, నవంబర్ 3 (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
సికింద్రాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ని, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి ని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మేము బిల్డర్లు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. వివిధ అధికార శాఖల నుండి నిరంతర వేధింపులు, ఒత్తిడులు ఎదురవడం వల్ల తమ వృత్తిని గౌరవంగా కొనసాగించడం కష్టతరమైంది. ప్రస్తుతం వ్యాపారం కన్నా మనుగడ కోసం పోరాడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.
సికింద్రాబాద్‌లో దాదాపు 90 శాతం బిల్డర్లు ఇక్కడే పుట్టి పెరిగిన వారేనని, ఈ ప్రాంత అభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేశామని వారు తెలిపారు. అయితే, మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో పాటు, బ్లాక్‌మెయిలర్లు, జీ హెచ్ ఎం సి, రిజిస్ట్రేషన్ విభాగం, విద్యుత్ శాఖల నుండి వచ్చే ఒత్తిడుల వల్ల తమ పరిస్థితి దయనీయంగా మారిందని వివరించారు.సికింద్రాబాద్‌లో భూముల ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగుల స్వంతమైనవిగా, బహుళ యజమానుల మధ్య పంచుకోబడిన చిన్న ప్లాట్లుగా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో జీ+5 భవనాల నిర్మాణం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో, అటువంటి నిర్మాణాలకు జీ హెచ్ ఎం సి స్పష్టమైన, ఆచరణాత్మక విధానాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు.
జీ హెచ్ ఎం సి అవసరమైతే అదనపు రుసుములు విధించవచ్చని, లేదా నిర్దిష్ట నిర్మాణ మార్గదర్శకాలు జారీ చేయవచ్చని కానీ, అనవసర వేధింపులకు ముగింపు పలికి, స్పష్టమైన పరిష్కారాన్ని ఇవ్వాలని వారు అభ్యర్థించారు.ఇక ఈ సమస్యలను సమగ్రంగా పరిష్కరించడానికి సీఎం దృష్టికి తీసుకెళ్తానని అలాగే
జీ హెచ్ ఎం సి, విద్యుత్ శాఖ, హెచ్ ఎం డి ఏ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కూడిన సంయుక్త సమావేశాన్ని మీ నాయకత్వంలో నిర్వహించాలని డిప్యూటీ మేయర్ ను కోరారు.
