గ్రామీణ ప్రాంతాలలో 104 సంజీవనిగా ప్రభుత్వానిక మంచి పేరు తీసుకువచ్చిందని
104 ఉద్యోగుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రవి వర్మ అన్నారు. శుక్రవారం 104 ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను, సంఘ సమస్యలను తెలియజేసినందుకు 104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ని సస్పేషన్ చేయటం దారుణమని, తక్షణమే సస్పేషన్ను రద్దు చెయ్యాలని కోరుతూ ప్రాధమిక వైద్యశాలల వైద్యాధికారులను వినతి పత్రం అందిచే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 104 ఉద్యోగులకు భవ్య యాజమాన్యం తగ్గించిన జీతాలు పూర్తి స్థాయిలో అమలు చెయ్యాలని, గతంలో ఇచ్చిన మాదిరి గానే 15 క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని, బఫర్ ఉద్యోగులను తీసుకోవాలని కోరారు. ఏడు నెలలు పూర్తి అయినా యాజమాన్యం ఇప్పటి వరకు ప్లే స్లిప్పులు, ఐడీ కార్డులు, నియామక పత్రాలు ఇవ్వలేదని తక్షనం ఇవ్వాలని కోరారు. గత అరబిందో బకాయిలన పూర్తి స్థాయిలో ఇప్పించి ఉద్యోగులను న్యాయం చెయ్యాలని కోరారు. తూర్పుగంగవరం వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రాజేష్ యాదవ్ ల కువినతి పత్రం అందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ కె వంశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
