దేశం మరియు ఆంధ్రప్రదేశ్ లో అమెరికా అధిక సుంకాల ప్రభావం, జరిగిన నష్టం, నష్ట నివారణ చర్యలు మరియు నూతన మార్కెట్లు గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పరిశ్రమల మంత్రి, జితిన్ ప్రసాద సమాదానమిస్తూ
గత 2 సంవత్సరాలలో అమెరికా అధిక సుంకాలతో దేశం మరియు ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమలు, వ్యాపారం, వ్యవసాయం, సముద్ర ఎగుమతులు తదితర రంగాలలో జరిగిన నష్టం మరియు ఎగుమతులపై ప్రభుత్వం పర్యవేషణ కొనసాగించుచున్నదని, దేశంలో మొత్తంలో 2023 లో 279 బిలియన్ డాలర్లు, 2024 లో 284 బిలియన్ డాలర్లు మరియు 2025 లో 292 బిలియన్ డాలర్లు దేశంలో మొత్తం ఎగుమతులు జరుగగా, సముద్ర ఉత్పత్తులు వరుసగా 5.22, 4.95 మరియు 5.75 బిలియన్ డాలర్లు జరిగాయని మరియు ఆంధ్రప్రదేశ్ నుండి 2023-24 లో 19,760 మిలియన్ డాలర్లు మరియు 2024-25 లో 20.783 మిలియన్ డాలర్లు సరుకుల ఎగుమతులు జరిగాయని తెలిపారు.
అమెరికా సుంకాల చర్యలపై ఉభయ ప్రయోజనకారియైన భారత్ – అమెరికా ద్వైపాక్షిక వాణిధ్య ఒప్పందం అనుసరించి చర్చలు ప్రభుత్వం జరుపుతున్నదని, దాని ప్రభావం తగ్గింపుకు సమగ్ర బహుముఖ వ్యూహం రచించినదని, తక్షణ ఉపసమనం కొరకు అన్ని పరిశ్రమలకు సహాయక చర్యలు క్రింద, 2025-26 వరకు 2030-31 వరకు అన్ని రకాల ఎగుమతులు పెంపుకు రూ.25,060 కోట్లు, నూరు శాతం క్రెడిట్ గారెంటీ క్రింద రూ.20,000 కోట్లు మరియు సముద్ర ఉత్పత్తుల పెంపుకు రూ,21,274 కోట్లు ఆమోదించబడినదని తెలిపారు. రిజర్వు బ్యాంకు వారు నష్టపడిన ఎగుమతిదారులకు రుణ చెల్లింపులపై తాత్కాలిక నిషేధం కల్పించిందని తెలిపారు.
అధిక సుంకాల ప్రభావంపై వుత్పత్తిదారులు, ఎగుమతిదారులు, ఎగుమతి కౌన్సిల్స్, పరిశ్రమల సంఘాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రభుత్వం చర్చలు జరుపుచున్నదని కేంద్ర మంత్రి తెలియజేశారు.
కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖా మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన సీఎం ,మంత్రులు, ఎంపీ మాగుంట
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్ర బాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖా మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని సీఎం చంద్రబాబు నాయుడు , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసారు. పలు అంశాలపై చర్చించారు .

