హైదరాబాద్ ఫిబ్రవరి 10,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ నగరంలో రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1 నుండి డ్రైవింగ్ లైసెన్స్ (DL) లేకుండా వాహనాలు నడిపే వారిపై నిరంతర ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణ సమయంలో ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యే అసలు డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి. లైసెన్స్ లేని వారు వెంటనే సంబంధిత ప్రాంతీయ రవాణా శాఖ (RTA) కార్యాలయం నుండి దానిని పొందాలని సూచించారు. నగరంలో జరుగుతున్న మెజారిటీ రోడ్డు ప్రమాదాల్లో, వాహనం నడుపుతున్న వ్యక్తికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడమే ప్రధాన కారణమని గమనించమన్నారు.తమ వాహనాలను డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు ఇచ్చే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.. లైసెన్స్ లేని వారికి వాహనాన్ని ఇవ్వడం నేరంగా పరిగణించబడుతుందన్నారు లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగితే, సదరు వాహనానికి ఇన్సూరెన్స్ (Insurance) క్లెయిమ్ వర్తించదని, దీనివల్ల తీవ్రమైన ఆర్థిక మరియు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంచేశారు.నగరవాసులందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాహనదారులను కోరారు.
మార్గదర్శకాలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు: మార్చి 1 నుండి ప్రత్యేక తనిఖీలు.
11
Feb