సింగరాయకొండ లోని మూలగుంటపాడు గ్రామం నందు గల శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ నందు అనుమానాస్పదముగా మృతి చెందిన 6వ తరగతి విద్యార్థి సయ్యద్ తౌషిక్ కు సంబంధించి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్రీమెన్ కమిటీ ఫిబ్రవరి 22న సదరు పాఠశాలను సందర్శించి విచారణ నిర్వహించారు.
సదరు విచారణ నందు పలు అవకతవకలను గుర్తించడం జరిగినట్లు , కావున సదరు లొపాలను పరిగణనలోకి తీసుకొని సదరు పాఠశాల యొక్క గుర్తింపును 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయవలసినదిగా పాఠశాల షోకాజు నోటీసును జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సి.వి.రేణుక తెలియజేసారు.
మూలగుంటపాడు శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కు షోకాజ్ నోటీసు జారీ చేసిన జిల్లా విద్యాశాఖఅధికారి రేణుక
03
Mar