పుల్లటి మజ్జిగను నీటిలో కలిసి పిచికారి చేయటం వలన అనేక తెగుళ్లను
నివారించవచ్చని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో బాగంగా బుధవారం వెలుగు వారి పాలెం, బొద్దికూరపాడు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు పులిచిన 12 లీటర్ల మజ్జిగను 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయవచ్చని చెప్పారు. ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం మూడు గంటల తర్వాత పిచికారి చెయ్యాలని తెలిపారు. ఆకు, కాయ మచ్చల తెగుళ్లు, బూజు తెగుళ్ల నివారించవచ్చని వివరించారు. విఏఏ ఆదినారాయణ, రైతులు పాల్గొన్నారు.
