గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పద్ధతిన 20 సంవత్సరాలు పనిచేసిన ఎ ఎన్ ఎం లను అకారణంగా ఉద్యోగాల నుండి తొలగించారని వారందరూ కూడా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారని మానవతా దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి తిరిగి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి బుధవారం రాష్ట్ర సచివాలయంలో మాదిగ సంక్షేమ పోరాట సమితి అధ్యక్షుడు కొమ్మ సుజన్ మాదిగ వినతి పత్రాన్ని అందించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 220 మంది గత 20 సంవత్సరాలుగా వారందరూ అర్బన్ హెల్త్ సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిన ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేశారని వారిని గత వై సి పి ప్రభుత్వం ఎటువంటి కారణాలు చూపకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం ద్వారా ఆ కుటుంబాలు అన్ని వీధిన పడ్డాయని మానవత దృక్పథంతో ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి ని విజ్ఞప్తి చేయడం జరిగింది. స్పందించిన మంత్రి ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తో పాటుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి కూడా తీసుకువెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి ఎస్ ప్రతినిధులు గద్దే త్యాగరాజు, తేళ్ల జయరాజ్ ప్రకాశం జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ మొలతోటి గురవయ్య, బక్క ఆనంద్, సురేష్, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకురాలు సుగుణ కుమారి,బసవదేవి, ఉషారాణి, శిరోమణి తదితరులు పాల్గొన్నారు.
