ప్రజా సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా మీడియా చురుకైన పాత్ర పోషించాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

ప్రజా సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా మీడియా చురుకైన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
సూచించారు. జిల్లాలో తొలి విడతలో అక్రిడేషన్ కార్డులు పొందిన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులకు, కలెక్టరేట్ రిపోర్టర్లకు గురువారం ప్రకాశం భవనంలో ఆయన వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో చేపట్టబోతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై స్పష్టత ఇచ్చారు. ఆయా విషయాలలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నిరంతర వారధిగా ఉండాలని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *