మండల ప్రజా పరిషత్ సమావేశంలో సర్పంచ్, ఎంపీటీలు లేవనేత్తిన సమస్య లను వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. స్థానిక మండల పరిషత్ సమావేశం హాలులో ఎంపీడీవో పి.అజిత ఆద్వర్యంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన మండలప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తీసుక వస్తున్నందున ఆయాశాఖలకుచెందిన అధికారులు వాటిపైప్రత్యేక శ్రద్ద చూపి పరిష్కరించాలనా నరు. ప్రజా ప్రతినిధుల సహకారం లేకుంటే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. పం చాయతీల అభివృద్ధికి ప్రభుత్వం గ్రామపంచాయతీలకు వచ్చే. గైడ్ లైన్స్ సెక్రటరీలు పంచాయతీ సర్పంచ్ ల కు సక్రమంగా చెప్పటం లేదన్నారు. దీని వల్ల పంచా యతీలకు విడుదలైన గ్రాంట్ ఏవిధంగా వినియోగించాలో అవహన లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిబంధనలకు అనుగుణంగా గ్రామాల్లోపనులు చేపట్టి పంచాయతీల అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి మాట్లాడుతూ రామతీర్థం మంచినీరు వేసవి రాక మునుపే గ్రామాల్లోకి రావటం లేదన్నారు. ప్రతి సమావేశంలో రామతీర్ధం మంచినీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలని చెపుతున్నా ఎందుకు సరఫరా జరగటం లేదని ఆరడబ్ల్యుఎస్ ఏఈ వాలిని ప్రశ్నించారు. మోటార్లు మరమ్మత్తులకు గురవుతున్నాయని
అర్ డబ్యుఎస్ ఎఈ వాలిని ప్రశ్నించారు. మోటార్లు మరమ్మత్తులకు గురవుతున్నాయని ఏఈ చెబుతుండగా కాలాయాపన చేయకుండా తక్షణమే మోటార్లకు మరమ్మతు లు చేయించి వేసవి కాలంలో ప్రజలు దాహర్తితో ఇబ్బందులు పడే ప్రమాధం వుందని మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాన్నారు. మండలంలో మొ క్కజొన్న సాగు అధికంగా వుందని, దిగుబడి అధికంగా వుండే అవకాశం వున్నందున మొక్కజొన్న కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు రూ.2400కు కొనుగోలు చేసే విధంగా చూడాలని, లేకుంటే రైతాంగం తీవ్రంగా నష్టపోతారని జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, విఠలాపురం సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి సభ దృష్టికి తీసుక వచ్చారు. ఈక్రాప్ నమోదు చేసిన కందులను కొనుగోలు కేంద్రాలకు తీసుక వెళితే ప్రభుత్వ నిబంధనల పేరిట పరిమితంగానే కందులను కొనుగోలు చేయాల్సి వస్తుందని, ఈక్రాప్ నమోదయిన మిగిలిన పంట రైతుల వద్దే మిగిలి పోతూ నష్టపోతు న్నారని, ఈక్రాప్ నమోదయిన పంట మొత్తాన్ని కొనుగొలు చేసి రైతాంగాన్ని ఆదుకు
నేలాచూడాలని మన్నేపల్లి సొసైటీ అధ్యక్షులు గొంది రమణారెడ్డి సభ దృష్టి కి తీసుక వచ్చారు.గత ఏడాది మండలంలో పదవ తరగతి ఉత్తీర్ణత జిల్లాలో అధమస్థానంలో నిలిచిందని, ఈఏడాది పదవ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతశాతంలో ముందంజలో వుండేలా చూడాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డిలు విద్యాశాఖాధికారి సుబ్బయ్యకు సూచించారు.ఈ కార్యక్రమంలో వైఎస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, ఎంపీడీవో అజిత,
డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, వైద్యాధికారులు ప్రవీణ్ కుమార్, మౌనిక, పశు
తీసి వైద్యాధికారిణి మౌనిక, బిసి బాలికల హస్టల్ వార్డెన్ తెరేజమ్మ, మహిళా సర్పంచ్ లు ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులను దుశ్వాలువాలువాతో ఘనం గా సత్కరించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ ల
సంఘం అధ్యక్షులు మారం ఇంద్రసేనారెడ్డి, కోఆప్సన్ సభ్యులు కరిముల్లా, మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.


