రైతులకు రోశయ్య వెన్నంటి ఉత్తమ సేవలు అందించారని నేటి తరానికి ఆయన సేవలు
అదర్శనీయమని వక్తలు అన్నారు. 34 సంవత్సరాల పాటు ఎన్ ఎన్ పీ ఆయుకట్టు లక్కర్ గా పనిచేసి పదవీవిరమణ పొందిన మెట్టెల రోశయ్యకు మంగళవారం గుంటి గంగా భవాని ఆలయం వద్ద యాదవ్ అన్నదాన సంద్రంలో బంధు మిత్రులు ప్రత్యేక అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నాగంబొట్ల పాలెం సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య, కరువది మేజర్ డిస్ట్రిబ్యూషన్ కమిటి వైన్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్ల పాటి మోషే, మాజీ ఎఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, యాదవ సంఘ సెక్రటరీ ఆవుల ఆదినారాయణ, ఎన్ఎన్పీ డీ ఈ ఈ గిరి బాబు, ఎఈ లు కోటేశ్వర రావు, కిరణ్ కుమార్, నబ్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల సిబ్బంది,
బంధు మిత్రులు పాల్గొన్నారు.

