ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ కార్యాలయం లో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
పార్టీ జెండా ఆవిష్క రించారు. దర్శి ఎమ్మెల్యే , ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ , ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రాహ్మనంద రెడ్డి , ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి తదితరులు పాల్గొని కేక్ ను కట్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వక్తలు వివరించారు. రాబోవు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 2029లో మరలా పార్టీ విజయదుందభి మోగిస్తుందని అన్నారు.




