ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహణ

నీటి కాసు
లు వారోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు మోడల్ ఐ హాస్పటల్ సౌజన్యంతో తాళ్లూరు పీహెచ్ సి లో గురువారం నీటి కాసుల కంటి పరీక్షలను నిర్వహించారు. కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ డి అర్పణ షాఫర్ పాల్గొని కంటి పరీక్షలను నిర్వహించారు.75 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన 8 మందికి కంటి చికిత్సలకు సిఫార్స్ చేసారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ మారం వెంకట రమణా రెడ్డి, జిల్లా అందత్వ నివారణ అధికారి నళిని , పీహెచ్ సి వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, రాజేష్ యాదవ్, ఆఫ్తాలమిస్ట్ ఉమ, సీహెచ్ఐ రమణ, పీహెచ్ఎన్ విజయలక్ష్మి, హెచ్ ఎన్ పీవీ రవి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *