చేపల కూర ఎవరికైనా ఎందుకు ఇష్టం ఉండదు…..
గుటుక్కున నోట్లో వేసుకుంటాం
అయితే బ్రతికి ఉన్న చేపను తినలేం కదా. ..
ఇలా అనుకోకుండా ఒకరి నోట్లో అదేనండి గొంతు లో
బ్రతికిన చేప ఇరుక్కుంటే……వారి బాధ వర్ణానాతీతం..
ఇలాంటి ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఒంగోలు కు చెందిన
సుబ్రహ్మణ్యం వేటకు వెళ్లి వచ్చాక వల నుంచి చేపలను వేరు చేస్తూ వున్నా సమయం లో నోట్లో
వాలను పట్టుకొన్న సమయం లో చేప నోట్ల కి వెళ్లినట్లు బాధితుడు చెప్పారు. బ్రతికిన చేప గొంతు లోకి వెళ్లి అది కాస్త
గొంతులో ఇరుక్కుంది. ఇక కక్క లేక మింగలేక ఆ జాలరి పాట్లు
అన్ని ఇన్ని కావు..
ఇక చేసేదేమి లేక సదరు మత్యకారుడు ఒంగోలు లో జి జి హెచ్ అత్యవసర విభాగం లో బంధువులు చేర్పించగా … గొంతు లో చేప ఉందని గుర్తించి ఈ ఎన్ టి విభాగానికి సిఫారసు చేసారు.
ఈ ఎన్ టి వైద్యులను సంప్రదించారు. ఈ ఎన్ టి విభాగ అధిపతి డా ప్రభాకర్
నేతృత్వం లోని వైద్యులు పరిశీలించి …. శస్త్ర చికిత్స అవసరం అని భావించారు.
దీంతో అనస్థీషియా విభాగాన్ని కూడా సంప్రదించి ….
మత్తు ఇచ్చి చేపను బయటకు తియ్యాలి అని నిర్ణయించారు. సదరు మత్యకారుడు
కుటుంబ సభ్యుల అనుమతి తో దాదాపు గంట పాటు ట్రాకియాష్టిమి పద్ధతి లో చెపను విజయవంతంగా
బయటకు తీశారు. ఇలా చెపను బయటకు తియ్యడం తో సదరు మత్శ్యకారుడి
ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..
ఈ క్లిష్టతరమైన శస్త్ర చికిత్స ను విజయవంతంగా నిర్వహించిన బృందాన్ని జి జి హెచ్ సూపరెంటెండెంట్ డా మాణిక్య రావు అభినందించారు. ఈ శస్త్రచికిత్స ను నిర్వహించిన బృందం లో ఈ ఎన్ టి హెచ్ ఓ డి డా ఎం ప్రభాకర్ , డా రాంబాబు, డా కవిత, డా అర్జున్, డా లాలస, లకు అభినందనలు తెలిపారు.

