బీకేవీ గ్రీన్ ఛానెల్ హైవేరోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్తాయి నష్ట పరిహారం అందజేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. బీకేవీ హైవే రోడ్డు నిర్మాణంలో భూములు ఇచ్చిన మల్కాపురం, తాళ్లూరు గ్రామ రైతులకు నష్టపరిహారం అందక పోవటంతో నష్టపరిహారం అందని రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకుని భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు జేసీ కల్పనాకుమారి బుధ వారం రైతుల పొలాలను స్వయంగా పరిశీలించారు. తాళ్లూరు సమీపాన గల సాగర్ కాలువ హైవే రోడ్డు నిర్మాణంలో పోగా సాగర్ కాలువ ఏర్పాటుకు భూమి అవసరం కాగా ఆప్రాంత రైతులు, దేవుని మాన్యం సాగు చేస్తున్న కౌలు రైతులకు చెందిన పొలాలను పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో కాలువ పూడి పోగా ప్రత్యేకంగా కాలువ
పొలాలను పరిశీలించారు. రొడ్డు నిర్మాణంలొకాలువ పూడి పోగా ప్రత్యేకంగా కాలువ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. భూములు ఇచ్చేందుకు ముందుకువచ్చిన రైతులకు త్వరిత గతిన నష్ట పరిహారంఅందిం చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మల్కాపురం సమీపాన హైవే రోడ్డు నిర్మాణానికి 36 సెంట్ల పొలం ఇవ్వగా 22 సెంట్ల భూమిని మాత్రమే నష్టపరిహారం అందించారు. మిగిలిన 14 సెంట్ల భూమికి నష్టపరిహారం అందక పోవటంతో ఆ రైతు నష్టపరిహారం చెల్లించిన తరువాతే రోడ్డు వేసుకోవాలని పనులు జరుగకుండ నిలిపి వేశాడు. ఈవిషయమై జేసీ ఆప్రాంతాన్ని పరిశీలించి మిగిలిన భూమికి మిగిలిన భూమికి చెల్లించాల్సిన నష్ట పరిహారం అందేలా చూస్తామని, పనులు నిర్వహించేందుకు సహాకరించాలని రైతుకు తెలపటంతో అందుకు అంగీకరించారు. ఈకార్యక్రమంలో అద్దంకి ఆర్డీవో జాన్సన్, తహసీల్దార్ బి.వి.రమణారావు, మండల సర్వేయర్ మహేష్, విఆర్వోలు నాగలక్ష్మి, నాగూర్ బి విలేజ్ సర్వేయర్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
