తాళ్లూరు మండలంలో గురువారం భక్తి శ్రర్థలతో తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ప్రజలు ప్రసిద్ధ దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు భక్తులకు, ప్రజలకు ఉగాది పచ్చడి పంచి పెట్టారు. పంచాగ శ్రవణం చేసారు. బొద్దికూరపాడు శ్రీ కోదంగ రామ స్వామి ప్రాంగణంలో గాయత్రి మందిర్ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. గాయత్రి మందిర్ పూజారులు వెంకటేశ్వర్లు, రాంజీ, వాసు స్వాములు పాల్గొన్నారు. భక్తులకు ఉగాది పచ్చడి తీర్థ ప్రసాదాలు అందించారు.

