యువతకు ఇచ్చిన మాట ప్రకారం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం- రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నాం, ఇది సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధికి నిదర్శనం-దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాం – మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి

యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉగాది కానుకగా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ..యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉగాది కానుకగా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 16,347 టీచర్ పోస్టులతో పాటు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశాం. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్థానిక యువత స్కిల్ ని గుర్తించి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పిస్తున్నాం. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాం, త్వరలో ఎస్సి, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నాం, ఇది సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధికి నిదర్శనం. వైసీపీ పాలనలో ఉద్యోగాలు కల్పించకపోగా కమీషన్ల కోసం ఉన్న పరిశ్రమల్ని తరిమేసి యువతను రోడ్డున పడేశారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మంత్రికి, సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు….

దివ్యాంగ శక్తి పధకంతో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి గారిని కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి మంత్రి స్వామి కిదివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *