తాళ్లూరు: స్థానిక ఎన్నికలలో మండల జెడ్పీటీసీ స్థానంతో పాటు, ఎంపీటీసీలు కూడ ఏడు స్థానాలు కేటాయించి మహిళలకే అగ్రస్థానం కల్పించారు. మండలంలో మొత్తం 14 స్థానాలు ఉండగా, ఏడు ఎంపీటీసీ స్థానాలు మహిళలకు కేటాయించారు. అందులో ఎంపీపీ స్థానం కూడ జనరల్ మహిళ కావటం విశేషం. దీంతో ఎంపీపీ అభ్యర్థిగా టిడిపి కి చెందిన రాష్ట్ర నాటక రంగ అకాడమి డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి సతీమణి రమణమ్మ శివరామపురం ప్రాదేశికం నుండి నామినేషన్ దాఖలు చేసారు. దీంతో వారి ఎన్నిక ఇక లాంఛన ప్రాయమే కానున్నది.

జనసేన మహిళా అభ్యర్థి నామినేషన్ తిరష్కరణ …
జనసేన అభ్యర్థిగా మల్కాపురం చెందిన అనపర్తి పుష్పాలు నామినేషన్ దాఖలు చేయగా ఆమె దివ్యాంగురాలు (మూగ, చెవుడు) కావటంతో ఆర్జే దేవనహాయం నామినేషన్ను తిరస్కరించారు. దీంతో ఆమె ఆర్డీఓ కోర్టుకు అప్పీలు చేసుకున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: