ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం వెలుగువారి పాలెం గ్రామంలో నాంచారమ్మ గుడి సమీపంలో వెలుగువారి పాలెం నుండి బొద్దికూరపాడు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డులో గృహాలలోని మురికి నీరంతా రోడ్డుమీద ప్రవహిస్తూ గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. వివరాలలోకి వెళితే …….తారు రోడ్డుకు ఇరువైపులా మురికి నీరు వెళ్లే కాలువలలో దిబ్బలు వేసి సైడ్ కాలువలలో మురికి నీరు , వర్షపు నీరు ప్రవహించకుండా చేసినందు వలన మురికి నీరు ప్రధాన రహదారిపై ప్రవహించి మోకాటి లోతు గుంతలు ఏర్పడి గుంతల నిండా నిండుగా మురికి నీరు ఉండి ఆ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురి అవు చున్నారు. రోడ్డంతా మురికి నీరుతో, గుంతలతో ప్రమాదభరితంగా ఉండటంతో చిన్నపిల్లలు , మహిళలు, ముసలివారు ఆ రోడ్డుపై నడవటం కష్టంగా ఉంది. సమీపంలోని గృహాల వారికి మురికి నీరు దుర్వాసన వెదజల్లుతుంది. కావున సదరు రోడ్డులో రెండు వైపులా దిబ్బలు తొలగించి ప్రోక్లైన్ తో సైడ్ కాలువ తీసి గుంతలు పూడ్చి వాహనదారులకు , పాదచారులకు, చుట్టుపక్కల గృహాల వారికి ఇబ్బంది కలగకుండా చేయవలసిందిగా సంబందిత అధికారులను ప్రజలు కోరుతున్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: