మన సంస్కృతి కలలు ఎంతో గొప్పవి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని.

సికింద్రాబాద్ అక్టోబర్ 25, ( జె ఎస్ డి ఎం న్యూస్) :
మన సంస్కృతి, కళలు ఎంతో గొప్పవని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని హరి హర కళా భవన్ లో లాలి నిధి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో 9 గంటల నిరంతర కూచిపూడి నృత్య ప్రదర్శనకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా లాలి నిధి, ఆమె బృందం నృత్య ప్రదర్శనను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విదేశాలలో మన సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతో గొప్పగా ఆచరిస్తుంటే, మన దగ్గర కొందరు పాటించకపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం కూడా సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుండే లాలి నిధి కూచిపూడి, ఇతర నృత్యాలలో అనేక ప్రదర్శనలు నిర్వహించి రాణిస్తూ అనేక అవార్డులు సొంతం చేసుకుందని పేర్కొన్నారు. ప్రముఖ కవి డాక్టర్ సి. నారాయణ రెడ్డి చేతుల మీదుగా లాలి బిరుదు ను అందుకున్న నిధి లాలి నిధి అకాడమీ ని ఏర్పాటు చేసి అనేకమందికి కూచిపూడి నృత్యం లో శిక్షణ ఇవ్వడం అభినందనీయం అన్నారు. నిరంతరాయంగా 9 గంటల పాటు నృత్య ప్రదర్శన చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో కూడా ప్రోత్సహించాలని కోరారు. అనంతరం నిర్వాహకులు స్వర్ణ, వెంకటేష్ దంపతులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఘనంగా సన్మానించి మెమెంటో ను అందజేశారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు టి. శ్రీహరి, అఖిల్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *