బేగంపేట మార్చి 28
(జే ఎస్ డి ఎం న్యూస్) :
అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ 3వ దశ లో భాగంగా పాటిగడ్డ ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై ట్రాఫిక్ అడ్మిన్ ఏసిపి లక్ష్మణ్ అవగాహన కల్పించారు. బేగంపేట టిటిఐ ఇన్స్పెక్టర్ నాగుల అశోక్ వారి సిబ్బంది ఆధ్వర్యంలో పాటిగడ్డ సికింద్రాబాద్ లోని గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు & రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఏసీపీ (ట్రాఫిక్ అడ్మిన్) ముఖ్య అతిథిగా హాజరైమాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల దశ నుండే ట్రాఫిక్ నియమాలపై అవగాహనపెంపొందించుకోవాలని తెలియజేసారు.
విద్యార్థులకు చిన్నతనం నుండే రోడ్ భద్రతపై అవగాహన కల్పించాలి అని అన్నారు. రోడ్ పై మన భద్రతతో పాటు ఇతరుల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకత గురించి వారికి అవగాహన కల్పించారు.
బాధ్యతగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం మన అందరి బాధ్యత అని వివరించారు. ఎల్లప్పుడూ తల్లిదండ్రులను మరియు పెద్దలను గౌరవిస్తూ క్రమశిక్షణతో ఉండాలి. బస్సు, ఆటో, కారు ఎక్కేటప్పుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు.
బేగంపేట టిటిఐ ఇన్స్పెక్టర్ నాగుల అశోక్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహనా కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు పిల్లలు (మైనర్లు) వాహనాలు నడపరాదని, అది చట్టరీత్య నేరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశనుండి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని తెలియజేశారు. రోడ్ దాటునపుడు జీబ్రా లైన్స్, నడవడానికి ఎల్లప్పుడూ ఫుట్‌పాత్‌నుఉపయోగించడం వలన కలిగే లాభాలు తెలియజేశారు. బైక్ నడిపేటప్పుడు రైడర్ మరియు పిలియన్ రైడర్ తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ నియమాలు పాటించాలి అని వారి తల్లి తండ్రులకు చెప్పాలని తెలియజేసినారు. ట్రాఫిక్ సైన్‌బోర్డులు, ప్లకార్డులు ఉపయోగించి రోడ్ పై మన భద్రతతో పాటు ఇతరుల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకత గురించి వారికి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 150 మంది విద్యార్థులు, హెడ్ మాస్టర్ సూర్య, సిబ్బంది మరియు టి టి ఐ బేగంపేట్ సిబ్బంది రాజేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

