అక్రమ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి ఒకరి అరెస్ట్.ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్న కల్తీ బేకరీ ఉత్పత్తులు – రూ. 12,54,280లు విలువైన సొత్తు స్వాధీనం.

హైదరాబాద్ మార్చి 28
(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్), గుడిమల్కాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో, కేడీ కాలనీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న అక్రమ బేకరీ తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు. ఈ దాడిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, భారీ మొత్తంలో నిల్వ ఉంచిన బేకరీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.కేడీ కాలనీకి చెందిన అహ్మద్ రజా (46)ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ దాడులలో మొత్తం రూ 12,54,280లు విలువ కలిగిన ముడి పదార్ధాలు,యంత్రాలను పోలీసులు సీజ్ చేశారు.వాటిలో 60 బస్తాల మైదాపిండి ,చక్కెర 30 బస్తాలు,పామాయిల్ 47బాక్సులు,హిమానీ బేక్ మ్యాజిక్ నెయ్యి188బాక్సులు,తయారు చేసిన బిస్కట్లు (ఉస్మానియా,కాజు,చాయ్,ప్యాన్ బిస్కట్లు) ,తయారీకి ఉపయోగించే యంత్రాలను సీజ్ చేశారు.నిందితుడు ఎలాంటి చెల్లు బాటు అయ్యే లైసెన్స్ లేకుండా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తక్కువ నాణ్యత కలిగిన ముడి పదార్ధాలతో తయారు చేసిన ఉత్పత్తులు ప్రజల ను అనారోగ్య సమస్యలకు గురిచేస్తాయని అధికారులు తెలియ జేశారు.నిందితుడిపై గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.ఈ దాడి ని హైదరాబాద్ సిటీ అడిషనల్ డి సి పి (టాస్క్ఫోర్స్) అందే శ్రీనివాసరావు పర్యవేక్షణలో గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేష్ ,గుడి మల్కా పూర్ ఇన్స్పెక్టర్ చిర్ర రామయ్య ఎస్సైలు వెంకట రమణ,సురేష్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *