రామాయణ పరమార్థం అందరికి ఆదర్శ సందేశం- శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామ చంద్ర రామానుజ జీయరుస్వామి

లోకంలో సర్వోత్కృష్ట గుణాలన్ని శ్రీరామునిలో వున్నందునే శ్రీరాముడు ప్రజలందరికి ఆరాధ్యదైవ మయ్యాడని శ్రీభాస్య సిద్దాంతపీఠాధిపతులుఅనంత శ్రీవిభూషిత శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయరు స్వామి ఉద్బోదించారు. విఠలాపు రంలోని వైకుంఠ రామాలయ ప్రథమ త్రయాహ్నిక బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఆదివారం నిర్వహించిన మహా పూర్ణాహుతికి రామానుజ చినజియర్ స్వామి ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈసందర్భంగా భక్తులకు రామాయణ పరమార్థం గురించి సందేశమిచ్చారు. ఒకటే మాట-ఒకటే పత్ని- ఒకటే బాణం శ్రీరామచంద్రుని ఆదర్శా లన్నారు. శక్తివున్నా ఒద్దికగా వుండటం రామ తత్వమని, అవకాశం వున్నా భర్త వెంట వుండటం సీతతత్వమని, కష్టాల్లో తోడు నిలవడం లక్షమణ తత్వమని, నమ్మిన వారి కోసం తెగించటం ఆంజనేయతత్వమని ఉపదేశించారు .
ఆలయంలో రామాయణ పారాయణం జరిపితే ఆలయం లో శక్తి మరింత బలో పేతం అవుతుందని సూచించారు. ఈసందర్భంగా ఆలయ నిర్వహకులు మారం అంజిరెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపారు. రామానుజచిన జియ్యర్ స్వామికి భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మారం ఇం ద్రసేనారెడ్డి, పలువురు ప్రముఖులు, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు. అన్నదాన’ కార్యక్రమం నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *