తాళ్లూరు మండలంలో తీవ్ర వేడి దెబ్బకు ముగ్గురు వృద్ధులు మృతి చెందారు. రజానగరంకు చెందిన షేక్ నుడుగులగుంట మస్తాన్ (62), కొర్రపాటి వారి పాలెంకు చెందిన ముత్తరపు సుబ్బా రావు (85), బొద్దికూరపాడుకు చెందిన నన్నపురెడ్డి లింగమ్మ (75) మృతి చెందారు. గత రెండు రోజుల నుండి 44 నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో వాతావరణంలో తేమ శాతం లేక ఉక్కు పోత పోస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు విల విల లాడుతున్నారు. వయస్సు పై బడిన అనేక మంది తీవ్ర వేడిమితో విల విల లాడుతూ మంచం పాలైనారు.
తీవ్ర వేడిమికి వృద్ధులు మృతి
21
May