హైకోర్టు ఉత్తర్వులతో విధుల్లో చేరిన నాగంబొట్లపాలెం పంచాయతీ కార్యదర్శిరమణారెడ్డి

మహిళా ఉద్యోగిపట్ల అసభ్య ప్రవర్తన ఆ రోపణలతో సస్పెండ్ లో వున్న నాగంబొట్ల పాలెం పంచాయతీ కార్యదర్శి ఐ వి రమణారెడ్డి హైకోర్టు ఉత్తర్వుల మేరకు శనివారం విధుల్లో చేరారు. నాగంబొట్లపాలెం కార్యదర్శి ఐ.వి రమణారెడ్డి తాళ్లూరు గ్రామ పంచాయతీకి ఇంచార్జి కార్యదర్శిగా పని చేస్తున్న కాలంలో మహిళా ఉద్యోగి డిజిటల్ అసిస్టెంట్ పట్ల అసభ్య ప్రవర్తన చేశాడని ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్ కు ఆమహిళా ఉద్యోగి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ఒంగోలు ఆర్డీవో నేతృత్వంలో కమిటీని నియమించి విచారణ చేయించారు. సస్పెండైన కార్యదర్శి రమణారెడ్డి తనను అకారణంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని, విచారణ నివేదిక కాఫీని, ఫిర్యాదు కాపీని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశాడు. అధికారులు సంబందిత వివరాలు ఇవ్వక పోవటంతో కార్యదర్శి రమణా రెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులమేరకు కలెక్టర్ ఉత్తర్వుల
మేరకు నాగంబొట్లపాలెం పంచాయతీకి కార్యదర్శిగా రమణారెడ్డికి పోస్టింగ్ ఇసూ విధుల్లో చేర్చుకోవాలని డీపీవో స్థానిక ఎంపీడీవోకు ఉత్తర్వులు జారీ చేశారు. డీపీవోఉత్తర్వుల మేరకు ఇంచార్జి ఎంపీడీవో వి.శ్రీనివాసరావు నాగంబొట్ల పాలెం పంచాయతీ కార్యదర్శిగా ఐ.వి.రమణారెడ్డిని విధుల్లోకి చేర్చుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

విచారణ చేపట్టిన డియల్డీవో సువార్తమ్మ

హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ రాజాబాబు పంచాయతీకార్యదర్శి రమణారెడ్డిపై వచ్చిన అబియోగాలపై అద్దంకి డిల్డీవో సువార్తమ్మను విచారణ అధికారిగా నియమించారు. ఆమె శనివారం తాళ్లూరు సచివాలయంలో సెక్రటరీ రమణారెడ్డిని
విచారించి స్టేట్ మెంట్ నమోదు చేశారు. సచివాలయ సిబ్బందిని కూడా విచారించి వివరాలు సేకరించారు. విచారణ నివేదికను తగు చర్యల నిమిత్తం జిల్లా అధికారు లకు అందజేయనున్నట్లు ఆమెతెలిపారు. ఈ విచారణలో డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీని వాసరావు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *