అద్దంకి పట్టణంలోని సర్వే నంబర్ 986లో ఉన్న 5.51 ఎకరాల ప్రైవేటు పట్టా భూమి 22సీ కింద నమోదు చేసి దేవాదాయశాఖ పరిధిలోకి చేర్చడంతో తమకు అన్యాయం జరిగిందని బాధితులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ఆదివారం నాడు సంతమాగులూరు పుట్టవారిపాలెం క్యాంపు కార్యాలయం నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో మంత్రిని కలిసిన బాధితులు, తమ భూమిని తిరిగి తమ పేర్లపై నమోదు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల వినతిపై స్పందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెంటనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. సమస్యపై సమగ్రంగా పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూ యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా, నిబంధనల ప్రకారం సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
