ఉత్తమ యాజమాన్య పద్ధతులో అధిక పాల దిగుబడి -తాళ్లూరు మండల పశు వైద్యాధికారి ప్రతాప్ రెడ్డి

ఉత్తమ యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి సాధ్యమని తాళ్లూరు మండల పశు వైద్యాధికారి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆత్మ సౌజన్యంతో రమణాల వారి పాలెంలో అధిక పాల ఉత్పత్తికి పాటించాల్సిన జాగ్రత్తలపై రైతులకు శిక్షణా కార్యమం నిర్వహించారు. డాక్టర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మేలు రకాల పశుగ్రాసాలైన నేపియర్, రెడ్ నేపియర్ జాతి మేత అధిక పాల ఉత్తిత్తికి చేయూత ఇస్తుందని చెప్పారు. ఏడాదికి ఒక దూడ పెయ్య దూత ఉత్పిత్తి ద్వారా ఆదాయం పొందవచ్చని చెప్పారు. డాక్టర్ వంశీ మాట్లాడుతూ నూడి పశువుల సంరక్షణ, ఈతల మధ్య అంతారాయం, మూడు నెలలకు కట్టించటం ద్వారా పాల ఉత్తిత్తి పెంచవచ్చని తెలిపారు. ఆత్మ ఎటీఎం రామి రెడ్డి మాట్లాడుతూ పశువులలో పొదుగు వ్యాధి రాకుండా నివారించు పద్దతులను వివరించారు. బి టీ ఎం శేషరావు పాడి రైతుల అభ్యున్నతికి కోసం ఆత్మ ద్వారా అమలు చేస్తున్న శిక్షణ, విజ్ఞాన యాత్రలు, ప్రదర్శన క్షేత్రాలను, పథకాలను వివరించారు. పాల సొసైటీ అధ్యక్షురాలు కె తిరుపతమ్మ, వి హెచ్ ఏ రాధాక్రిష్ణ గోపాల మిత్రలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *