సీఎం ప్రజావాణిలో కొత్తగా మీ-సేవా కేంద్రంప్రారంభించిన చిన్నారెడ్డి.విద్యాసాగర్, రవి కిరణ్సీఎం ప్రజావాణిలో 321 దరఖాస్తులు

సీఎం ప్రజావాణిలో 321 దరఖాస్తులు
హైదరాబాద్ ఆగస్ట్ 4,(జే ఎస్ డి ఎం న్యూస్) : సీఎం ప్రజావాణిలో కొత్తగా ఏర్పాటు చేసిన మీ-సేవా కేంద్రాన్ని సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ ఆఫీసర్ కే. విద్యాసాగర్, మీ – సేవా డైరెక్టర్ రవికిరణ్ లతో కలిసి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.
సీఎం ప్రజావాణికి రాష్ట్రవ్యాప్తంగా వచ్చేదరఖాస్తుదారులకు వివిధ రకాలైన సేవలు అందించేందుకు ఉద్దేశించి మీ – సేవా కేంద్రాన్నినూతనంగా ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ కోసం కానీ, వివిధ శాఖల నుంచి పలు అంశాలపై ధృవ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ మీ-సేవా కేంద్రం ఎంతగానో ఉపయోగపడ
నుంది.రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు అన్ని శాఖల డెస్క్ లకు అదనంగా మీ – సేవా కేంద్రం సేవలు సీఎం ప్రజావాణిలో అందుబాటులోకి వచ్చాయి. జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణిలో 321 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇంచార్జ్ జి చిన్నారెడ్డి స్టేట్ నోడల్ అధికారి కే విద్యాసాగర్ దరఖాస్తులు స్వీకరించి వాటిపై ఎండార్స్ చేసి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.
వాటిలోపంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు 144, రెవెన్యూ శాఖకు 51, హోంశాఖకు 25, ప్రవాసి ప్రజావాణికి 2, ఇతర శాఖలకు 99 దరఖాస్తులు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న కంటిన్జెన్సీ ఉద్యోగులు తమకు 18 నెలల వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని దరఖాస్తులు అందజేశారు. వెంటనే స్పందించిన చిన్నారెడ్డి డిజిపి సీవీ ఆనంద్ కు ఫోన్ చేసి సమస్యను వివరించి వేతనాలు వెంటనే అందించే చర్యలుతీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎసిపి ఉమేందర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎన్నారై సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి, సమన్వయకర్త బొజ్జ అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *