మెగా డీఎస్సీ పేరుతో కష్టపడి చదుకున్న నిరు ద్యోగ యువతను మోసగించేందుకే అధికారంలోకి వచ్చారా.. అని వై సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రశ్నించారు. మెగా డీఎస్సీలో అవకతవకలకు పాల్పడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీ నామా చేసి సీబీఐ విచారణ వేయాలని కోరుతూ స్థానిక వై సీపీ కార్యాలయం వద్ద మూడో రోజు రిలే నిరాహార దీక్షలో ముండ్లమూరు మండల నాయకులు పాల్గొన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రిలే దీక్షలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మార్మో గింది. పలువురు నాయకులు ప్రభుత్వ మోసాలను ఎండగట్టారు. అనంతరం డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మలు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వెంకాయమ్మ మాట్లాడుతూ చంద్ర బాబు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో 143
హామీలు ఇచ్చి ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యో గాలు ఇస్తామని, ఉద్యోగాలు లేని వారికి రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను దారుణంగా మోసగించారన్నారు.
ఒక్క పాఠశాలను అభివృద్ధి చేస్తే ఒట్టు…
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన శాఖలో ఒక్క పాఠశాలను అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ప్రకటించగానే 3.25 లక్షమంది నిరుద్యోగులు కష్టపడి చదుకుని పరీక్షలు రాస్తే వారందరినీ కాదని తమ మనుషు లకు ఉద్యోగాలు అమ్ముకుని నిరుద్యోగులను దారుణంగా మోసగించారన్నారు. దీంతో కష్టపడిన యువత ఇంటో కూర్చుంటే తమ పార్టీ కార్య కర్తలు ఉద్యోగాల్లో ఉన్నారన్నారు. తమ మను షుల కోసం 2 శాతం ఉండే స్పోర్ట్స్ కోటాను 4 శాతానికి పెంచారన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు ఉద్యోగాలను అమ్మేసి మెరిట్ ఉన్న నిరుద్యోగులను మోసగించి విద్యావ్యవస్థకు కలంకం తీసుకొచ్చారన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పీజురీయంబర్స్మెం ట్లో ఉన్న రూ.7500 కోట్లు బాకీ వెంటనే చెల్లించాలని ఈ నెల 10వ తేదీన పట్టణంలోని నియో జకవర్గ కార్యాలయం నుంచి గడియారం స్తంభం సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నిరు ద్యోగ యువత, యువకులు పాల్గొని విజయవం తం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ముండ్లమూరు, దొనకొండ మండ లాల పార్టీ అధ్యక్షులు చింతా శ్రీనివాసరెడ్డి, కాకర్ల కృ ష్ణారెడ్డి, ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడికొండ జయంతి, జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, మండల యువజన విభాగం అధ్యక్షుడు దుగ్గినేని రామకృష్ణ, ఎంపీటీసీ గుణపాటి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సూదిదేవర అంజయ్య. ప్రచార విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపోగు డగ్లస్, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బంకా నాగిరెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షుడు భిక్షాలు రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నా రెడ్డి, నాయకులు గొంది అప్పిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, బిజ్జం కృష్ణారెడ్డి, మేడగం రమణారెడ్డి, కుంటా అచ్చారావు, గెర్నెపూడి ప్రసన్న, సుంకర చిన్న బ్రహ్మరెడ్డి, కిలారి వెంకట్రావు, ఎనుముల శ్రీని వాసరెడ్డి, నలదిమ్ము రమణారెడ్డి, ఎనుముల నర సారెడ్డి, ఆదినారాయణరెడ్డి, అబ్బన అంజిరెడ్డి, కొండారెడ్డి, కుమ్మిత శ్రీనివాసరెడ్డి, సుబ్బయ్య, సాయి, కృష్ణారెడ్డి, కైపు శ్రీనివాసరెడ్డి, పాలెపోగు వీరయ్య, దాసరి ఏలియా, దారం తిరుపతిరెడ్డి, కేసనపల్లి నాగేశ్వరరావు, లక్కిరెడ్డి సుబ్బారెడ్డి, మైల శ్రీరాములు, గోను వెంగళరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.


