కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ఈనెల 10వ తేదీన నిర్వహణ -మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించిన సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం “సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ (Citizen Feedback QR) కోడ్”ను అందుబాటులోకి తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు చేసిన ఫిర్యాదుల పరిష్కారంపై వారి అభిప్రాయాలను నేరుగా సేకరించి, పరిష్కార నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు, పౌర సేవా కేంద్రాల్లో ప్రదర్శించిన సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ను ఫిర్యాదుదారులు స్కాన్ చేసి తమ సమస్య పరిష్కారంపై ఫీడ్‌బ్యాక్ నమోదు చేయవచ్చని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
   కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటిలో సహాయకులతో కూడిన అర్జీ స్వీకరణ కౌంటర్లు, రిసెప్షన్ సదుపాయం, జిల్లా మరియు మండల స్థాయి అధికారుల హాజరు, వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు, తాగునీటి సౌకర్యం, అర్జీల పర్యవేక్షణతో పాటు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడమైనది.

అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందడంతో పాటు, సమస్య పరిష్కారమైన అనంతరం సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను నమోదు చేసి ప్రజా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *