బేగంపేట ఆగస్ట్ 9,(జే ఎస్ డి ఎం న్యూస్)
బోనాల జాతర తెలంగాణా సంస్కృతి కి నిదర్శనం అని ప్రకాశం నగర్ డివిజన్ బీ ఆర్ ఎస్ నాయకుడు పొన్నబోయిన సురేష్ యాదవ్ అన్నారు.ఆదివారం ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని డివిజన్ పరిధిలోని వివిధ అమ్మవారి దేవాలయాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో పొన్నబోయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ఆలయ కమిటీల నిర్వాహకులు సురేష్ యాదవ్ ను శాలువాలు,పూల మాలలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆయన వెంట ఆయా బస్తీల నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.



