చెత్త రహిత ఆకర్షనీయ దారులు తీర్చిదిద్దెదుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని డీఎల్ పి ఓ ఉమాదేవి అన్నారు. మాధవరం గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను ఆమె బుధవారం పరిశీలించారు. పాఠశాల పరిసరాలలో ఉన్న దిబ్బలను, రోడ్ల వెంబడి ఉన్న పేడ దిబ్బలను తీసివేయించి దారులను శుభ్రంగా ఉంచాలని కోరారు. గ్రామ కార్యదర్శి గ్రామాలలో తిరిగి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని చెప్పారు.ఇన్చార్జి ఎంపీడీఓ వి శ్రీనివాస రావు, ఏఈ వెంకటేశ్వర్లు, పంచాయితీ కార్యదర్శి స్వర్ణ లత తదితరులు పాల్గొన్నారు.
