బెంగుళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల పురోగతిపై బికేవీ డిప్యూటీ కలెక్టర్ ప్రసాద్ రాజు బుధవారం తాళ్లూరు రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పనులు పూర్తి అయిన వివరాలు, ఇంకా ఎక్కడైనా ఏవైనా ఇబ్బందులు ఉన్న విషయాలను చర్చించారు. రైతులకు తక్షణమే అందాల్సిన
నష్టపరిహారాన్ని అందించి పనులు పురోగతికి సహకరించాలని కోరారు. ఇక మిగిలిన పనులు కూడ త్వరగా జరగటానికి రెవిన్యూ అధికారులు తమ వంతు చేయూత ఇవ్వాలని కోరారు. తాళ్లూరు తహసీల్దార్ బివి రమణా రావు, బికేవీ డిప్యూటీ తహసీల్దార్ కెవీ రాజు, సర్వేయర్లు పాల్గొన్నారు
బికేవీ పనులపై బికేవీ డిప్యూటీ కలెక్టర్ సమీక్ష
12
Aug