హెచ్ఐవి ఎయిడ్స్ ను సమాజంలో పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే క్షేత్రస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలోయువత కీలక భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఉందని గ్రామ రాష్ట్ర దేశ అభివృద్ధికి యువత పాత్రల కీలకమైంది – ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వర రావు

హెచ్ఐవి ఎయిడ్స్ ను సమాజంలో పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే క్షేత్రస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలోయువత కీలక భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఉందని గ్రామ రాష్ట్ర దేశ అభివృద్ధికి యువత పాత్రల కీలకమైందని ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వర రావు పేర్కొన్నారు . బుధవారం ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకాశం జిల్లా దిష వివిధ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాత రిమ్స్ హాస్పటల్ నుండి అవగాహన ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే వెంకటేశ్వరవు రావు ప్రారంభించడం జరిగినది. జాతియ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మలన కొరకు, హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడం కొరకు, ఆగస్టు 12 నుండి అక్టోబర్ 12 వరకు 60 రోజులు పాటు క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి సమాజంలో ప్రతి ఒక్కరికి నిర్మూలన కొరకు ఇంటెన్స్ ఫైడ్ ఐఇసి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలను నిర్దేశించడం జరిగినదని ప్రతి ఒక్కరు అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు అయి హెచ్ఐవి ఎయిడ్స్ లేని సమాజం రూపుదిద్దుటకు అందరు కృషి చేయాలని ప్రకాశం జిల్లా ముఖ్య లక్షణాలు ప్రకాశం జిల్లాకు హై ప్రయారిటీ క్యాటగిరి కింద7.87% ప్రయారిటీ షేర్ కేటాయించబడింది ఈ ప్రచారంలో 501 గ్రామాలొ ఐఇసి కార్యక్రమాలు నిర్వహించాలి 40 కళాజాతల ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాలి,66ఫ్లాష్ మబ్ లు ద్వారా అవగాహన కార్యక్రమాలు,31 గ్రామాల్లో జానపద కళారూపాల ద్వారా ప్రచారం చేయాలి,50 మార్కెట్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి,252 పాఠశాలలో864 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి,16 చోట్ల మాల్స్ లొ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి 69 కళాశాలలో199 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి, 42 ర్యాలీలు నిర్వహించాలి,315 వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలి 82,650 రిస్క్ అసెస్మెంట్ నిర్వహించబడటానికినిర్వహించడా నికి లక్ష్యంగా పెట్టుకోన్నాం 16,530 ఇంటింటికి ఈ అవగాహన కార్యక్రమాలు చేరువయ్యే విధంగా లక్ష్యంగా పెట్టుకోవడం 7 ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయడం ఈ లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు ప్రకాశం జిల్లా లెప్రసీ,టి బి మరియు ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ జి. బాలాజీ మాట్లాడుతూ హై రిస్క్ హాట్స్పాట్ ఏరియాలో సిబిఎస్ క్యాంపులు పెట్టి కొత్తగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి సంక్రమించిన వారిని గుర్తించి వారి విషయాలు గోప్యం గా ఉంచి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న ఏ. ఆర్ టి సెంటర్ కు అనుసంధానం చేసి వారికి మందులు వాడుకునే విధంగా ఏర్పాటు చేయటం వారికి వైరల్ లోడ్ తగ్గకుండా చూసుకోవటం తద్వారా వారిని ప్రాణాపాయం నుంచి కాపాడటం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. వి సాగర్ గ్రో స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. ఎస్. డి ప్రసాద్ బాబు పాజిటివ్ పి. పి.ఎన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సి. ఎస్ ఓ పి సాయి హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, గ్రో, సినార్డ్ ప్రోగ్రామ్ మేనేజర్లు బి. దుర్గా సురేంద్ర ఎస్ కె. పీర్ భాష, వెంకటేశ్వరరావు లింకు వర్కర్ స్కీమ్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ గాలి స్వరూప్ కుమార్ కమ్యూనిటీ సపోర్ట్ సెంటర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుజాత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *