హైదరాబాద్ ఆగస్టు 14, (జే ఎస్ డి ఎం న్యూస్) :
కాసు బ్రహ్మానందరెడ్డి (కే బి ఆర్ ) పార్క్ చుట్టూ ప్రతిపాదించిన వన్-వే ట్రాఫిక్ నిబంధనల అమలుపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ఉదయం 7:00 గంటలకు కేబీఆర్ పార్క్ వాకర్లతో బహిరంగ చర్చా కార్యక్రమాన్నినిర్వహించారుఈ సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, ట్రాఫిక్ డిసిపి-II కాజల్ లతో పాటు పలువురు ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది
పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ నెల 18 నుండి అమలులోకి రానున్న నూతన ట్రాఫిక్ మార్పుల గురించి వాకర్లకు అధికారులు వివరించారు. కొత్త ట్రాఫిక్ విధానం సులభంగా, క్రమబద్ధంగా అమలయ్యేందుకు పార్క్ సందర్శకులు,వాహనదారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
వాకర్లకు ట్రాఫిక్ పోలీసుల కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.
వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో (Parking Bays) మరియు మల్టీ-లెవల్ పార్కింగ్ సదుపాయంలో మాత్రమే నిలపాలన్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో రోడ్డుకు ఎదురుగా (రాంగ్ రూట్లో) వాహనాలు నడపకూడదనీ సూచించారు. ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన సవరించిన నిబంధనలు, సూచనలను తప్పక పాటించాలన్నారు.వన్-వే ట్రాఫిక్ విధానాన్ని విజయవంతం చేసేందుకు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలన్నారు.
నూతన ట్రాఫిక్ నిబంధనలపై కేబీఆర్ పార్క్ వాకర్ల నుండి సలహాలు, సూచనలనుస్వీకరించేందుకు పార్క్ ముందు QR కోడ్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రాకపోకలు సురక్షితంగా, వేగవంతంగా జరిగేందుకు పౌరులు, ముఖ్యంగా నిత్యం కేబీఆర్ పార్క్‌కు వచ్చే సందర్శకులు ఈ మార్పులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
కేబీఆర్ పార్క్ వద్ద వన్-వే ట్రాఫిక్ నిబంధనలు. వాకర్లతో ముఖాముఖి నిర్వహించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
14
Aug