హైదరాబాద్, ఆగస్టు 15, (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
పోలీస్ శాఖలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్
నర్సింహారాజు ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర సేవా మెడల్ అందుకున్నారు.
శనివారం జరిగిన కార్యక్రమంలో సీపీ రమేష్ రెడ్డి చేతుల మీదుగా నర్సింహారాజు ఈ
ప్రతిష్టాత్మక సేవా మెడల్‌ను స్వీకరించారు.ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, పోలీస్ వృత్తి నీ సామాజిక బాధ్యత గా నిర్వహిస్తూట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో చూపిన అంకితభావం, కర్తవ్యనిష్ఠ, సమర్థవంతమైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించడం విశేషం.
సేవా మెడల్ అందుకున్న సందర్భంగా ఇన్స్పెక్టర్ నర్సింహారాజు ను పోలీస్ అధికారులు, సిబ్బంది, సహచరులుఅభినందించారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, ప్రజల భద్రత మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మరింత అంకితభావంతో పనిచేస్తానని నర్సింహారాజు తెలిపారు.గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారికి రాష్ట్ర స్థాయి సేవా పురస్కారం లభించడం పట్ల స్థానికంగా కూడా హర్షం వ్యక్తమవుతోంది.

