భరత్ గౌడ్ ఆధ్వర్యంలో మహంకాళి జిల్లా లో బి జే పి బలోపేతం…..జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్.

బేగంపేట ఆగస్టు 15 , (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
భరత్ గౌడ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా లో జిల్లా అధ్యక్షులు గుండ గొని భరత్ గౌడ్ ఆధ్వర్యంలో బి జే పి బలోపేతం అవుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ అన్నారు.
భారతీయ జనతా పార్టీ – సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా అధ్యక్షులు గుండగోని భరత్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నెమలి ఆనంద్ భరత్ గౌడ్ ను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు.జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు తరలి వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నెమలి ఆనంద మాట్లాడుతూ భరత్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలనుఅధిరోహించాలని ఆకాంక్షించారు. భరత్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో నెమలి ఆనంద్ తో పాటు
సి. విజయ్ కుమార్, నక్క శ్రీనివాస్ గౌడ్ , టి. శ్రావణ్ కార్యకర్తలు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *