తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు జెడ్పీ
హైస్కూల్ విద్యార్థులకు పలువురు పూర్వ విద్యార్థులు దాతలుగా చేయూత ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దాతల బహుమతులను వారి ప్రతినిధులు అందించారు.
బొద్దికూరపాడు గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థిని, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పదో
తరగతి పరీక్షలో మొత్తం మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రధమ 5116/, ద్వితీయ 3116/, తృతీయ 2116 రూపాయలు చొప్పున ఏటా ఇస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
పూర్వ విద్యార్థి వెన్నపూస రామసుబ్బా రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశా లకు అవసరమైన ఇన్వర్టర్ కొనుగోలు కోసం శని వారం రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు. రిటైర్డ్ హెచ్ఎం సన్నపురెడ్డి అంజిరెడ్డితో ప్రధానోపాధ్యా యుడు పి.బ్రహ్మయ్యకు ఆ మొత్తాన్ని అందజేశారు. ఆయా కార్యక్రమా ల లో ఎస్ఎంసీ చైర్మన్ వైవీ రామిరెడ్డి, పోలంరెడ్డి రమణారెడ్డి, ఎంపీటీసీ కె.బాలకోటయ్య, మాజీ సొసైటీ అధ్యక్షుడు ,ఉప సర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి , గ్రామ పెద్దలు సంగన యోగిరెడ్డి, వై.నాగయ్య, రావినూతల వెంకట్రావు, పోలంరెడ్డి సుబ్బారెడ్డి ,
పద్మావతి, గజ్జల బాలిరెడ్డి, పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

