ప్రజాస్వామ్య ఓటుహక్కుని అపహాస్యం చేసిన సి.ఈ.సి జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలని సిఐటియు జిల్లా నాయకులు సి.హెచ్ మజుంధర్ అన్నారు.
దరిశి గడియారం స్థంభం సెంటర్ లో ఆదివారం సిఐటియు అధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది . సి.హెచ్ మజుంధర్ మాట్లాడుతూ…… స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ ముగ్గురు సభ్యులతో రాజ్యాంగ బద్దంగా అమలు చేయవలసిన పక్రియని గత 10 నెలల్లో 14 సార్లు మిగతా ఇద్దరు సర్ , కొత్త ఓట్లు చేర్పులు, బెంగాల్ , అస్సాం , బీహార్ ఎన్నికలు తదితర అంశాలను వ్యతిరేకించినా మెజారిటీ నిర్నయం కాకుండా జ్ఞానేశ్వకుమార్ ఒక్కరే బిజెపి పార్టీకి అనుకూలంగా నిర్నయాలు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని, ప్రజల ఓటు హక్కుని అపహస్యం చేయడం దుర్మార్గం అని రాజ్యాంగ పధవిలో ఉండే హక్కుకోల్పోయాలని , బిజెపికి లాభం చేయడం కోసమే ప్రజల హక్కులను నాశనం చేశారని రాజీనామా చేసే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు ఆఫీసు నుంచి సెంటర్ వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో సిఐటియు , సిపియం నాయకులు తాండవ రంగారావు మాట్లాడుతూ ……. సర్ పక్రియలో ప్రజలను 2002 ఓటర్ లిస్టు ఇప్పటి లిస్టు తేడా ఉన్నాయని కోట్లమందికి నోటీసులు ఇవ్వడం మీరు ప్రూప్స్ ఇచ్చి నిరూపించుకోవాలని ఆఫీసుల చుట్టూ తిప్పడం చేశారని ఓటు హక్కు కోసం ప్రజలు పనులు మానుకుని అనేక ఇబ్బందులు పడ్డారని అవేధన వ్యక్తం చేశారు. తంగిరాల వెంకటేశ్వర్లు , సందు వెంకటేశ్వరరావు , బొమ్మిరెడ్డి రత్నకుమారి, ఆదిలక్ష్మీ, సువాత్రమ్మ , ఉప్పు నారాయణ , దాసు, ఇస్సాయిల్, ఆదినారాయణ , సాల్మాన్ , టి.తిరపతమ్మ , జయమ్మ పాల్గొన్నారు .


